గతంలో కాషాయ బికినీ ధరించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. ఫొటోను వైరల్ చేస్తున్న దీపిక అభిమానులు
- 'పఠాన్' సినిమాలో కాషాయం రంగు బికినీలో దీపిక గ్లామర్ షో
- దీపికపై వెల్లువెత్తుతున్న విమర్శలు
- మిస్ ఇండియా పోటీల్లో స్మృతి కాషాయ బికినీ ధరించిన ఫొటోలు, వీడియోను వైరల్ చేస్తున్న దీపిక ఫ్యాన్స్
షారుఖ్ ఖాన్, దీపికా పదుకుణే కాంబినేషన్లో తెరకెక్కిన 'పఠాన్' సినిమా వివాదాస్పదంగా మారింది. ఈ చిత్రం నుంచి 'బేషరమ్' సాంగ్ ను చిత్ర యూనిట్ ఇటీవలే విడుదల చేసింది. ఈ పాటలో దీపిక బికినీలు ధరించి అందాలను ఆరబోసింది. మరోవైపు, ఆమె కాషాయ రంగు బికినీ ధరించడం బీజేపీకి, హిందూ వాదులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఆ రంగు దుస్తులను ధరించి అసభ్యకర సన్నివేశాలను ఎలా చేస్తారని మధ్యప్రదేశ్ హోంమంత్రి ప్రశ్నించారు. ఆ సన్నివేశాలను తొలగించకపోతే సినిమాపై నిషేధం విధిస్తామని కూడా హెచ్చరించారు. మరోవైపు, దీపికపై కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.
మరోవైపు ఈ ట్రోలింగ్ కు దీపిక అభిమానులు, కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు కౌంటర్ గా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాత ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తున్నారు. స్మృతి నటి అనే విషయం తెలిసిందే. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఆమె మోడల్ గా కూడా పని చేశారు. మిస్ ఇండియా పోటీల్లో సైతం పాల్గొన్నారు. 1998 మిస్ ఇండియా పోటీల్లో కాషాయ రంగు బికినీ ధరించి ఆమె క్యాట్ వాక్ చేసిన వీడియోలను ఓ వర్గం ఇప్పుడు వైరల్ చేస్తోంది. దీపికపై విమర్శలు గుప్పిస్తున్న వారు... దీనికి ఏం సమాధానం చెపుతారని ప్రశ్నిస్తున్నారు. కావాలనే బీజేపీ బికినీ వివాదాన్ని రెచ్చగొడుతోందని మండిపడుతున్నారు.