గూగుల్ ఫైల్స్ యాప్ లో డిజీలాకర్ త్వరలోనే..!

  • నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ తో గూగుల్ భాగస్వామ్యం
  • ఆండ్రాయిడ్ ఫోన్ ఫైల్స్ యాప్ తో డిజీలాకర్ అనుసంధానం
  • త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి
డిజీలాకర్ అన్నది ఒక డిజిటల్ స్టోరేజీ వాల్ట్. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఉచితంగా అందిస్తోంది. పౌరులు ఎవరైనా కానీ ఇందులో తమదైన ప్రత్యేక లాకర్ తెరుచుకోవచ్చు. బ్యాంకు లాకర్ గురించి వినే ఉంటారు. బ్యాంకు లాకర్ లో మనం బంగారం, డాక్యుమెంట్లు, ఇంకా విలువైనవి ఏవైనా ఉంటే భద్రంగా పెట్టుకోవచ్చు. డిజీ లాకర్ కూడా అంతే. మనకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లను ఇందులో అప్ లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా కానీ మొబైల్ ఫోన్ సాయంతో డాక్యుమెంట్లను పొందొచ్చు.

ఇప్పుడు గూగుల్ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ తో ఒప్పదం చేసుకుంది. డిజీలాకర్ సర్వీస్ ను తన ఆండ్రాయిడ్ ఫైల్స్ యాప్ లో భాగంగా ఆఫర్ చేయనుంది. దీంతో ప్రభుత్వం విడుదల చేసే అన్ని రకాల ముఖ్యమైన డాక్యుమెంట్లను ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్మార్ట్ ఫోన్లో ఫైల్స్ యాప్ నుంచే పొందడం సులభం అవుతుంది. త్వరలోనే ఈ సేవను అందించనున్నట్టు గూగుల్ ప్రకటించింది. డిజీలాకర్ యూజర్లు 2022 మార్చి నాటికి 10 కోట్లు దాటడం గమనార్హం.


More Telugu News