బిగ్ బాస్ హౌస్ లో ఎవరు జన్యూన్ కాదంటే ..!: శ్రీసత్య

  • బిగ్ బాస్ హౌస్ కి గ్లామర్ తెచ్చిన శ్రీసత్య 
  • 6వ పొజిషన్ లో ఎలిమినేషన్ 
  • తాజా ఇంటర్వ్యూలో ఇనయా ప్రస్తావన 
  • అలా స్టేట్మెంట్స్ పాస్ చేయడం కరెక్టుకాదని వ్యాఖ్య
బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో శ్రీసత్య టాప్ 5 పొజిషన్ లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె 6వ పొజిషన్ లో ఉండగా బయటికి వచ్చేసింది. హౌస్ కి గ్లామర్ తీసికొచ్చిన శ్రీసత్య, ఎదుటివారిపై మాటల దాడి చేయడానికి వెనుకాడని ఆమె అలా వెళ్లిపోవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. 

తాజా ఇంటర్వ్యూలో శ్రీసత్య మాట్లాడుతూ .. "ఏదైనా సరే నేను ఉన్న విషయాన్ని ముఖం పైనే చెప్పేస్తాను. అందువలన అందరూ నన్ను టార్గెట్ చేశారని అనుకుంటున్నాను. సూర్య వెళ్లిపోయిన దగ్గర నుంచి, ఆ వారం ఎవరు వెళ్లిపోతారో తెలియక అందరం భయపడ్డాము. నన్ను .. రేవంత్ ను .. శ్రీహాన్ ను ఉద్దేశించి ఇనయా ఓ కామెంట్ చేసింది. పచ్చకామెర్లు వచ్చినవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని అందుకే అంటారు. 

హౌస్ లో ఎవరు ఎలా గేమ్ ఆడుతున్నారనేది అర్థమైపోతూనే ఉంటుంది .. కానీ బయటికి చెప్పలేం. నాకు తెలిసి హౌస్ లో రాజ్ - శ్రీహాన్ జన్యూన్ గా అనిపించారు. జన్యూన్ కానివారుగా ఇనయా - కీర్తి కనిపించారు. ఇద్దరూ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు. కానీ ఆ విషయంలో వాళ్లకే క్లారిటీ ఉండదు. ఆ తరువాత సారీ చెబుతారు .. కానీ అది కరెక్టు కాదు గదా" అని చెప్పుకొచ్చింది.


More Telugu News