దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • మన సమాజంలో సామరస్యాన్ని, సంతోషాన్ని పెంచాలన్న ప్రధాని
  • క్రీస్తు ఉదాత్తమైన ఆలోచనలు, సేవ చేయడాన్ని గుర్తు చేసుకుందామని పిలుపు
  • పోప్ ఫ్రాన్సిస్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం శుభాకాంక్షలు
తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలకు తోడు, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తమ సంతోషాన్ని తోటివారితో పంచుకుంటున్నారు. అన్ని చర్చిలను ప్రత్యేకంగా విద్యుద్దీపాలతో అలంకరించారు. 

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ క్రిస్మస్ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘మేరీ క్రిస్మస్! ఈ ప్రత్యేక పర్వదినం మన సమాజంలో సామరస్యం, సంతోషాన్ని మరింత పెంచాలని కోరుకుంటున్నాను. ప్రభువైన ఏసుక్రీస్తు ఉదాత్తమైన ఆలోచనలను, సమాజానికి సేవ చేయడాన్ని గుర్తుచేసుకుందాం’’అని ప్రధాని ట్వీట్ చేశారు. 

ప్రపంచవ్యాప్తంగానూ ఏసుక్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకుంటున్నారు. పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడంతోపాటు శాంతి సందేశం ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సైతం శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్లు చేశారు.


More Telugu News