విమానంలో ఇద్దరి మధ్య గొడవ.. చెంపలు వాయించేసుకున్న ప్రయాణికులు.. వీడియో ఇదిగో!
- బ్యాంకాక్ నుంచి కోల్కతా వెళ్తున్న విమానంలో ఘటన
- వాగ్వివాదంతో మొదలై కొట్టుకునేంత వరకు వెళ్లిన గొడవ
- ఘటనపై స్పందించని ‘థాయ్ స్మైల్’
బ్యాంకాక్ నుంచి కోల్కతా వెళ్తున్న ‘థాయ్ స్మైల్’ ఎయిర్వేస్ విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య జరిగిన గొడవ పరస్పరం చేయి చేసుకునే వరకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. ప్రయాణికులు ఇద్దరూ పెద్దగా అరుస్తూ కలబడుతుండగా విమాన సిబ్బంది వారిని వారించే ప్రయత్నం చేశారు. మిగతా ప్రయాణికులు మాత్రం వీడియోను చిత్రీకరించడంలో మునిగిపోయారు.
గొడవ పడుతున్న ఇద్దరిలో ఒకరు ‘మర్యాదగా కూర్చోవాలని’ అంటే.. మరొకరు ‘చేయి కిందికి దించి మాట్లాడాలని’ చెప్పడం వీడియోలో వినిపిస్తోంది. ఆ తర్వాత క్షణాల్లోనే గొడవ పెద్దదైంది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు తోసుకున్నారు. అనంతరం ఒకరి చెంపలు ఒకరు వాయించుకున్నారు. అందులో ఓ వ్యక్తి తన కళ్లజోడు తీసి ఎదుటి వ్యక్తి చెంపలు వాయిస్తూ, ఆపకుండా పిడిగుద్దులు గుద్దాడు. దీంతో అతడు తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశాడు.
గొడవ పెద్దగా మారడంతో కల్పించుకున్న తోటి ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది వారిద్దరినీ విడదీశారు. అయితే, ఇంతకీ వారి మధ్య గొడవకు కారణం ఏంటన్న విషయం తెలియరాలేదు. ఈ ఘటనపై థాయ్ స్మైల్ ఎయిర్వేస్ స్పందించలేదు. విమానంలో గొడవ పడిన ప్రయాణికులపై చర్యలు తీసుకున్నారా? లేదా? అన్న వివరాలు తెలియరాలేదు. వీడియోను ట్విట్టర్లో పోస్టు చేసిన యూజర్ మాత్రం విమానం ల్యాండయ్యాక ఇద్దరినీ అరెస్ట్ చేస్తారని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు.