ఆధార్ సేవలపై ఫిర్యాదులు ఇలా దాఖలు చేయొచ్చు..!
- ఆన్ లైన్ లో సులభంగా చేసుకోవచ్చు
- మై ఆధార్ పోర్టల్ కు వెళ్లాలి
- సందేహాలు, విచారణల కోసం టోల్ ఫ్రీ నంబర్
ఆధార్ నేడు అన్నింటికీ ముఖ్యమైన ఆధారంగా మారిపోయింది. కనుక దీన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవడం ఎంతో అవసరం. ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిన వారు ఒక్కసారి విధిగా తమ వివరాలతో, ఫింగర్ ప్రింట్ లు ఇచ్చి అప్ డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ తాజాగా కోరింది. ఆధార్ సేవలు పొందే విషయంలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఫిర్యాదు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది.
ఆధార్ ఎక్స్ పీరియన్స్ న్యూ ఆన్ లైన్ కంప్లయింట్ పోర్టల్ పై ఫిర్యాదు దాఖలు చేయవచ్చు. అక్కడే రుజువులుగా తమ దగ్గరున్న డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయడానికి వీలుంది. ఇందుకోసం ఈ లింక్ https://myaadhaar.uidai.gov.in/file-complaint క్లిక్ చేస్తే నేరుగా మైఆధార్ కంప్లయింట్ పేజీకి వెళతారు. అక్కడ పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ వివరాలు, రాష్ట్రం, ఫిర్యాదు స్వయంగా నమోదు చేస్తున్నారా లేక, ఇతరుల కోసమా తెలియజేసి, ఫిర్యాదు దేనికి సంబంధించి? అనే వివరాలు ఇచ్చిన తర్వాత.. చివరిగా అక్కడి బాక్స్ లో ఫిర్యాదు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం క్యాపెచా టైప్ చేసి, నెక్స్ట్ పై క్లిక్ చేసి, సబ్ మిట్ చేయాలి.
ఆధార్ కు సంబంధించి ఎన్నో సందేహాలు, ప్రశ్నలు ఉంటుంటాయి. వీటిపై స్పష్టత కోసం సాయాన్ని పొందొచ్చు. 1947 అనే టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.