కృతి శెట్టి .. శ్రీలీల మధ్య గట్టి పోటీ ఉండే ఛాన్స్!

  • ఈ ఏడాది ఆరంభంలో 'బంగార్రాజు'తో హిట్ కొట్టిన కృతి 
  • ఈ ఏడాది చివరిలో 'ధమాకా'తో హిట్ అందుకున్న శ్రీలీల
  • గ్లామర్ .. యాక్టింగ్ .. డాన్సులలో ఇద్దరూ ఇద్దరే 
  • కొత్త ఏడాదిలో ఇద్దరి చేతుల్లోను పెద్ద ప్రాజెక్టులు
టాలీవుడ్ లో అడుగుపెడుతూనే కృతి శెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఫస్టు మూవీ 'ఉప్పెన' రిలీజ్ కాకముందే మరో రెండు సినిమాలు ఒప్పేసుకుంది. ఆ సినిమాలతో కలుపుకుని హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ఈ మధ్య  కాలంలో ఒక కొత్త హీరోయిన్ హ్యాట్రిక్ హిట్ ను దక్కించుకోవడం కృతి శెట్టి విషయంలోనే జరిగింది. ఈ ఏడాదిలో ఆమె నుంచి నాలుగు సినిమాలు రాగా, 'బంగార్రాజు' మాత్రమే హిట్ అయింది.2022 ఆరంభంలోనే హిట్ అందుకున్న ఈ బ్యూటీ, ఆ తరువాత వచ్చిన మూడు సినిమాల విషయంలోను ఆ టాక్ వినలేకపోయింది. ఇక ఆమె తరువాత ఇండస్ట్రీకి వచ్చిన శ్రీలీల ఈ ఏడాదిలో చేసిన సినిమా 'ధమాకా' ఒక్కటే. ఈ నెల 23వ తేదీన వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను నమోదు చేసింది. ఇప్పటికే ఈ సినిమా 70 కోట్ల మార్కును టచ్ చేసింది. గ్లామర్ విషయంలోను .. యాక్టింగ్ విషయంలోను ఇద్దరూ కూడా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. కృతి శెట్టితో పాటు శ్రీలీల కూడా మంచి డాన్సర్ అనే విషయాన్ని 'ధమాకా' సినిమా నిరూపించింది. ఈ ఏడాది ఆరంభంలో కృతి హిట్ అందుకుంటే .. చివరిలో శ్రీలీల హిట్ దక్కించుకుంది.  కొత్త ఏడాదిలో చేయడానికి ఇద్దరి చేతుల్లోను పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయి. ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండొచ్చనే టాక్ బలంగానే వినిపిస్తోంది మరి!


More Telugu News