జీవోలోని రూల్స్ వైసీపీ కి కూడా వర్తిస్తాయి: సజ్జల
- చీకటి జీవో అనడంలో అర్థంలేదని వ్యాఖ్యానించిన సజ్జల
- రోడ్లు ఉన్నది సమావేశాల కోసం కాదని వెల్లడి
- ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే కొత్త జీవో జారీ
ర్యాలీలు, సభలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవోపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రతిపక్షాలతో పాటు అధికారంలో ఉన్న వైసీపీకి కూడా వర్తిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. రోడ్లు ఉన్నది రాకపోకలకే తప్ప సభలు, సమావేశాల కోసం కాదని ఆయన తేల్చిచెప్పారు.
రాజకీయ సభల్లో ప్రమాదాలు జరుగుతుండడంతో భద్రతకు ప్రాధాన్యమిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ జీవోలో కొత్తవేమీ లేవని, గతంలో ఉన్న వాటినే ఇప్పుడు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సజ్జల వివరించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను చీకటి జీవో అనడంలో అర్థంలేదని సజ్జల చెప్పారు.
రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు పెట్టుకోవద్దని చెప్పలేదన్నారు. రోడ్లపై సభలు పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని చెబితే కక్ష సాధింపు చర్యలని అంటే ఎలాగని అడిగారు. జీవోలోని నిబంధనలు ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే కాదు వైసీపీకి కూడా వర్తిస్తాయని చెప్పారు.