హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ బీజేపీ బహిష్కృత నేత హోటల్ కూల్చివేత.. వీడియో ఇదిగో!
- మధ్యప్రదేశ్ లో ప్రభుత్వ నిర్ణయాన్ని అమలుచేసిన కలెక్టర్
- రోడ్డును ఆక్రమించి కట్టడంతో గతంలోనే నోటీసుల జారీ
- మంగళవారం సాయంత్రం డిటోనేటర్లతో పేల్చి, బిల్డింగ్ కూల్చివేత
నేరారోపణలు ఎదుర్కొంటున్న బహిష్కృత బీజేపీ నేతకు చెందిన అక్రమ కట్టడాన్ని మధ్యప్రదేశ్ సర్కారు కూల్చివేసింది. అనుమతుల్లేకుండా, రోడ్డును ఆక్రమించి కట్టిన హోటల్ ను నేలమట్టం చేసింది. మధ్యప్రదేశ్ లో మంగళవారం సాయంత్రం అధికారులు డైనమేట్స్ పెట్టి హోటల్ ను కూల్చేశారు.
మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ బహిష్కృత నేత మిష్రి చాంద్ గుప్తా తన ప్రత్యర్థి జగదీశ్ యాదవ్ ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కిందటి ఏడాది డిసెంబర్ నెల 22వ తారీఖున తన కారుతో యాదవ్ ను తొక్కించి చంపారని ప్రచారం జరుగుతోంది. అప్పటి నుంచి గుప్తా పరారీలో ఉన్నారు. గుప్తాపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే, గుప్తాను ఇంతవరకు పట్టుకోకపోవడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇండోర్ లోని చాంద్ గుప్తాకు చెందిన హోటల్ జైరామ్ ప్యాలెస్ ను అధికారులు మంగళవారం కూల్చేశారు. గుప్తా ఈ హోటల్ ను రోడ్డును ఆక్రమించి కట్టారని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం సాగర్ కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు హోటల్ దగ్గరికి చేరుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో దాదాపు 60 డిటోనేటర్లు అమర్చారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని జైరామ్ ప్యాలెస్ ను కూల్చేశారు.