పార్టీని వీడిన 12 మంది ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు

  • అప్పటి టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
  • స్వప్రయోజనాల కోసమే అంటున్న అగ్రనేతలు
  • మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
  • పార్టీ ఫిరాయింపుపై సీబీఐ విచారణ జరపాలని విజ్ఞప్తి
గతంలో కాంగ్రెస్ ను వీడి నాటి టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్)లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మల్లు రవి, సంపత్ తదితరులు నేడు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లారు. 

ఆ 12 మంది ఎమ్మెల్యేలు స్వప్రయోజనాల కోసమే అధికార పార్టీలో చేరారని ఆరోపించారు. పార్టీ మారిన తర్వాత వారు రాజకీయ, ఆర్థిక ప్రయోజనలు పొందారంటూ ఆ మేరకు వివరాలను తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై సీబీఐ విచారణ జరపాలని కాంగ్రెస్ నేతలు కోరారు. 

సబితా ఇంద్రారెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, రేగ కాంతారావు, చిరుమర్తి లింగయ్య, ఉపేందర్ రెడ్డి, జాజుల సురేందర్, ఆత్రం సక్కు, బానోతు హరిప్రియా నాయక్, సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో గెలిచి అప్పట్లో టీఆర్ఎస్ లోకి వెళ్లారు.


More Telugu News