భారత యుద్ధ విమాన మహిళా పైలెట్ అవని చతుర్వేది అరుదైన ఘనత
- ఈ నెల 12 నుంచి ఇండో-జపాన్ వైమానిక విన్యాసాలు
- జపాన్ లోని హయకురి ఎయిర్ బేస్ లో విన్యాసాలు
- విదేశాల్లో భారత్ తరఫున పాల్గొంటున్న తొలి మహిళా పైలెట్ అవని
- గతంలో మిగ్-21 బైసన్ యుద్ధ విమానం నడిపిన అవని
భారత్, జపాన్ దేశాలు తొలిసారిగా సంయుక్తంగా వైమానిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో భారత వాయుసేన స్క్వాడ్రన్ లీడర్ అవని చతుర్వేది అరుదైన ఘనత సొంతం చేసుకోనున్నారు. విదేశాల్లో భారత్ తరఫున యుద్ధ విన్యాసాల్లో పాల్గొంటున్న తొలి మహిళా పైలెట్ గా ఆమె నిలవనున్నారు. ఇండో-జపాన్ సంయుక్త విన్యాసాల్లో అవని సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానంతో పాల్గొననున్నారు.
అవని 2018లో మిగ్-21 బైసన్ విమానం నడిపిన తొలి మహిళా పైలెట్ గా ఖ్యాతి గడించారు. ఆమె ఒక్కతే ఆ విమానాన్ని నడిపి అతివలు పురుషులకేమీ తీసిపోరని చాటారు. ఈ నేపథ్యంలో, జపాన్ లోని హయకురి వైమానిక స్థావరంలో నిర్వహించే వీర్ గార్డియన్ వైమానిక విన్యాసాల్లో అవని సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
ఈ విన్యాసాలు జనవరి 12 నుంచి 26 వరకు జరగనున్నాయి. ఈ సంయుక్త విన్యాసాల కోసం భారత వాయుసేన నాలుగు సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానాలు, రెండు సీ-17 గ్లోబ్ మాస్టర్-III సైనిక రవాణా విమానాలు, ఐఎల్-78 గగనతల ఇంధన ట్యాంకర్ విమానం, 150 మంది సిబ్బందిని పంపిస్తోంది. అటు జపాన్ తన ఎఫ్-2, ఎఫ్-15 వంటి యుద్ధ విమానాలను రంగంలోకి దించుతోంది.