'గూఢచారి 2'లో సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాను: అడివి శేష్

  • గతంలో హిట్ కొట్టిన 'గూఢచారి'
  • ఆ సినిమా సీక్వెల్ గా రూపొందనున్న 'G2'
  • దర్శకుడిగా వినయ్ పరిచయం 
  • ఐదు దేశాల్లో షూటింగు ఉంటుందని చెప్పిన శేష్ 
  • వచ్చే ఏడాదిలోనే సినిమా రిలీజ్
చిన్న చిన్న పాత్రలతో నటుడిగా తన ప్రయాణాన్ని మొదలెట్టిన అడివి శేష్, ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం ట్రై చేస్తూ హీరోగా ఎదిగాడు. తనకంటూ ఒక జోనర్ ను సెట్ చేసుకున్నాడు. 2018లో ఆయన చేసిన 'గూఢచారి' పెద్ద హిట్. అప్పటి నుంచి ఆ సినిమా సీక్వెల్ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ సినిమా సీక్వెల్ కి సన్నాహాలు పూర్తయ్యాయి.
 
ఈ సినిమాకి 'G2' అనే టైటిల్ ను ఖాయం చేశారు. అనిల్ సుంకర .. అభిషేక్ అగర్వాల్ .. వివేక్ కూచిభొట్ల .. విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కొంత సేపటి క్రితమే ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను వదిలారు. ఈ సినిమా 'ప్రీ విజన్ ఈవెంట్' లో అడివి శేష్ మాట్లాడుతూ .. "ప్రపంచవ్యాప్తంగా ఈ ఫ్రాంచైజీని తీసుకుని వెళ్లాలనే ఒక తపన ఉంది. వినయ్ అనే కొత్త దర్శకుడితో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తనకి మంచి విజన్ ఉంది. స్పై యాక్షన్ తరహా సినిమాల్లో ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పగలను" అన్నాడు. 

'గూఢచారి' పార్టు 1 సౌత్ సినిమాల్లో స్పై ఫిలిమ్స్ ట్రెండ్ ను మళ్లీ తిరిగి తీసుకుని వచ్చింది. ఇక 'G 2' అనేది ఆల్ ఇండియా ఫ్రాంచైజ్ గా మారబోతోందని నేను గర్వంగా చెప్పగలను. నేను సిక్స్ ప్యాక్ చేసిన తరువాతనే షూటింగుకి వెళ్లడం జరుగుతుంది. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నాడు. ఐదు దేశాల్లో ఈ సినిమా షూటింగును ప్లాన్ చేయడం జరిగింది. 2024లో ఈ సినిమా థియేటర్లకు వస్తుంది" అని చెప్పారు.


More Telugu News