నాకు సినిమాలు తప్ప మరో మార్గంలేదు... కాంట్రాక్టులు చేయలేను: పవన్ కల్యాణ్

  • శ్రీకాకుళం జిల్లాలో యువశక్తి సభ
  • హాజరైన పవన్ కల్యాణ్
  • పూర్తి స్థాయి రాజకీయనేత ఎవరూ ఉండరన్న పవన్
  • జరుగుబాటుకు ఏదో ఒకటి చేసుకోవాల్సిందేనని వ్యాఖ్య  
వైసీపీ నేతలు తనను నిలకడలేని రాజకీయ నాయకుడు అంటుండడం పట్ల జనసేనాని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఏర్పాటు చేసిన యువశక్తి సభలో ఆయన ప్రసంగిస్తూ, ఈ దేశంలో ఎవరైనా పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు ఉన్నాడా? అని నిలదీశారు. 

"పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు అంటే రెండు అంశాలను పరిశీలించాలి. ఒకటి... ఆ నేతను పార్టీ బాగా చూసుకోవాలి. ఇంట్లో జరుగుబాటుకు, అతడి పిల్లల ఖర్చులకు పార్టీ డబ్బులు ఇవ్వాలి. లేకపోతే అతనికి వారసత్వంగా వచ్చిన ఆస్తులైనా ఉండాలి. అలా కాకుండా మీరు వ్యాపారాలు చేసుకుంటూ, రాజకీయాలు చేస్తూ పూర్తి స్థాయి రాజకీయనేతలు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూ రాజకీయాలు చేస్తున్నవాళ్లే. 

కోర్టుల్లో కేసులు వాదిస్తూ కపిల్ సిబాల్ రాజకీయాలు చేయడం లేదా? చిదంబరం కూడా న్యాయవాద వృత్తిని ప్రాక్టీస్ చేయలేదా? నేను కూడా అంతే... సినిమాలు చేయడం తప్ప నాకు వేరే దారి లేదు. ఇప్పటికిప్పుడు నేను వెళ్లి కాంట్రాక్టులు చేయలేను. కాంట్రాక్టులు చేసుకుంటూ రాజకీయాలు చేసుకోవచ్చా? సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా? నా పని నేను చూసుకుంటూనే దేశానికి, ప్రజలకు సమయం కేటాయిస్తున్నాను. నాకు డబ్బు అవసరం లేని సమయం అంటూ వస్తే ఆ రోజున సినిమాలతో సహా మొత్తం వదిలేస్తాను" అని స్పష్టం చేశారు.


More Telugu News