ఖమ్మంలో బీఆర్ఎస్ సభపై రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
  • ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న బీఆర్ఎస్ నాయకత్వం
  • జాతీయస్థాయి నేతలకు ఆహ్వానం!
  • తెలంగాణకు ఈశాన్య దిక్కులో సభ స్థానికులకే కలిసి వస్తుందన్న రేణుక
బీఆర్ఎస్ పార్టీ ప్రకటించాక తొలిసారిగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 18న సభ జరగనుంది. ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ అధినాయకత్వం... పలు రాష్ట్రాల సీఎంలను, వివిధ ప్రాంతీయ పార్టీల అధ్యక్షులను కూడా ఈ సభకు ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఖమ్మంలో బీఆర్ఎస్ సభపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి స్పందించారు. 

తెలంగాణకు ఈశాన్య దిక్కు స్థానికులకే కలిసి వస్తుందని, అది అందరికీ కలిసిరాదని వాస్తు గురించి ప్రస్తావించారు. బయటివాళ్లు ఖమ్మంలో సమావేశాలు పెడితే ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నిర్వహించే ఈ సభలో కేసీఆర్ వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. తెలంగాణను సర్వనాశనం చేసిన కేసీఆర్ ఈ సంవత్సరంలో అయినా వాస్తవాలు మాట్లాడడం అలవాటు చేసుకుంటారని ఆశిస్తున్నట్టు రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు.


More Telugu News