నాని ‘దసరా’ ఓటీటీ హక్కులు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్
- షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం
- నాని సరసన హీరోయిన్ గా కీర్తి సురేశ్
- మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దసరా’. బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతోంది. పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతోంది. ఈ చిత్రంలో నాని పూర్తి మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. షూటింగ్ ఇటీవలే ముగిసింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర పని చేసిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్న చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ‘దసరా’ ప్రపంచవ్యాప్తంగా మార్చి 30వ తేదీన విడుదల కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్ ముగిసిన తర్వాత నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ ఇండియా సౌత్ శనివారం ప్రకటించింది. ఈ మేరకు దసరా పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేసింది.