ధనిక భక్తులకు, వీఐపీలకే అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు: రమణ దీక్షితులు
- ఆలయ అధికారులు ఆగమ నియమాలు విస్మరిస్తున్నారని విమర్శలు
- ఆగమ శాస్త్ర నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వెల్లడి
- అధికారులు సొంత ప్రణాళికలతో పనిచేస్తున్నారన్న రమణ దీక్షితులు
తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఆలయ అధికారులు ఆగమ నియమాలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఆగమశాస్త్ర నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికారులు తమ సొంత ప్రణాళికల ప్రకారం పనిచేస్తున్నారని, ధనవంతులైన భక్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రమణదీక్షితులు ట్వీట్ చేశారు. వీఐపీల సేవలో తరిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి దారుణ పరిస్థితులు ఏపీలోనే చూస్తామని అసంతృప్తి వ్యక్తం చేశారు. రమణ దీక్షితులు గతంలోనూ టీటీడీ వ్యవస్థ, అధికారులపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.