కియారాకు సారీ చెప్పిన రామ్​ చరణ్​ భార్య ఉపాసన.. ఎందుకంటే!

  • నిన్న జైసల్మేర్ లో ఘనంగా కియారా, సిద్దార్థ్ మల్హోత్రా వివాహం
  • కొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితులకే ఆహ్వానం
  • ఆహ్వానం అందినా వెళ్లలేకపోయిన చరణ్, ఉపాసన దంపతులు
బాలీవుడ్ లో మరో ప్రేమ జంట ఒక్కటైంది. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా మంగళవారం జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, కొంతమంది స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ జంట పెళ్లి వేడుకకు ఆహ్వానం అందిన అతిథుల జాబితాలో కొంతమంది సన్నిహితులు మాత్రమే ఉన్నారు. టాలీవుడ్ అగ్ర హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా పెళ్లికి హాజరయ్యారంటూ తొలుత వార్తలు వచ్చాయి. కానీ, తాము పెళ్లికి రాలేకపోయామని ఉపాసన తాజాగా తెలిపారు. ఇందుకు నూతన దంతపతులకు సారీ చెప్పారు.

కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా తమ వివాహ ఆల్బమ్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్టుకు ఉపాసన కామెంట్ రాశారు. ‘అభినందనలు. మీ జంట చాలా అందంగా ఉంది. మేము హాజరుకానందుకు క్షమించండి. మీ ఇద్దరికీ ఎల్లప్పుడూ మా ప్రేమ ఉంటుంది’ అని పేర్కొన్నారు. కాగా, రామ్ చరణ్ ‘ఇది స్వర్గంలో జరిగిన మ్యాచ్’ అని కామెంట్ చేశారు.


More Telugu News