ఆకట్టుకుంటున్న 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' టీజర్!

  • నాగశౌర్య నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టయినర్ 
  • కథానాయికగా అలరించనున్న మాళవిక నాయర్
  • దర్శకత్వం వహించిన అవసరాల శ్రీనివాస్
  • మార్చి 17వ తేదీన సినిమా విడుదల
కథలో లవ్ మాత్రమే ఉంటే అలాంటి సినిమాలకి యూత్ ఎక్కువగా వస్తుంటుంది. ఆ ప్రేమకి కాస్త ఫ్యామిలీ నేపథ్యాన్ని యాడ్ చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తుంటారు. అందువల్లనే ప్రేమ ప్రధానమైన కుటుంబ చిత్రాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది .. అలాంటి కథలు రాబట్టే వసూళ్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. 

అలాంటి ఒక కథతో వస్తున్న సినిమానే 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. నాగశౌర్య - మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ సినిమాకి విశ్వప్రసాద్ - దాసరి పద్మజ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఆయనే కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణలు సమకూర్చడం విశేషం. 

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. హీరో .. హీరోయిన్ పాత్రలను పరిచయం చేస్తూ, ఆ పాత్రల చుట్టూ తిరిగే సన్నివేశాలపై ఈ టీజర్ కట్ చేశారు. కల్యాణి మాలిక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. 'ఉగాది' కానుకగా మార్చి 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు



More Telugu News