అశ్విన్​, జడేజా మ్యాజిక్​.. 110 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఆసీస్​

  • 61/1తో ఆదివారం ఆట కొనసాగించిన కంగారూ టీమ్
  • తొలి ఓవర్లోనే బ్రేక్ ఇచ్చిన అశ్విన్
  • వెంటవెంటనే ఐదు వికెట్లు పడగొట్టిన జడేజా
భారత్ తో రెండో టెస్టులో రెండో రోజు బౌలింగ్, బ్యాటింగ్ లో సత్తా చాటిన ఆస్ట్రేలియా మూడో రోజు తేలిపోయింది. భారత స్పిన్నర్లు జడేజా, అశ్విన్ దెబ్బకు తోకముడిచింది. ఈ ఇద్దరి స్పిన్ వలలో చిక్కుకొని ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. ఓవర్ నైట్ స్కోరు 61/1తో ఆదివారం ఆట కొనసాగించిన ఆసీస్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. రెండో రోజు చివర్లో దూకుడుగా ఆడిన ట్రావిస్ హెడ్ (43)ను అశ్విన్ కీపర్ క్యాచ్ ద్వారా పెవిలియన్ చేర్చాడు. కొద్దిసేపటికే స్టీవ్ స్మిత్ (9), మాట్ రెన్ షా (2)ను ఎల్బీ చేశాడు.

 ఈ దశలో రవీంద్ర జడేజా జోరు మొదలు పెట్టాడు. క్రీజులో కుదరుకున్న లుబుషేన్ (35)ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆసీస్ ను దెబ్బకొట్టాడు. కోహ్లీ క్యాచ్ ద్వారా పీటర్ హ్యాండ్స్ కాంబ్ (0)ను పెవిలియన్ చేర్చిన అతను ఆ తర్వాత అలెక్స్ క్యారీ (7), కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మొత్తంగా 49 పరుగుల తేడాలో ఏడు వికెట్లు కోల్పోయిందిన ఆస్ట్రేలియా 110/8తో నిలిచింది.


More Telugu News