పాకిస్థాన్ కూ పాకిన ‘ఆర్ఆర్ఆర్’ మానియా.. నాట్ నాటు పాటకు చిందులేసిన పాక్ నటి

  • ఓ వివాహ వేడుకకు హాజరైన నటి హానియా ఆమిర్
  • కుర్రాడితో కలసి నాటు నాటు సాంగ్ కు స్టెప్పులు
  • ఉత్సాహంగా మారిపోయిన వివాహ వేదిక
రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ‘నాటు నాటు’ పాట గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఈ పాటకు స్టెప్స్ వేసేందుకు ఉత్సాహం ప్రదర్శించిన వారే. గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న ఈ పాట, ఇప్పుడు ఆస్కార్ అవార్డుల బరిలోనూ నిలిచింది. 

ఈ పాట దాయాది దేశమైన పాకిస్థాన్ కూ చేరుకుంది. ప్రముఖ పాకిస్థానీ నటి హానియా ఆమిర్ సైతం నాటునాటు పాటకు డ్యాన్స్ ఇరగదీసింది. ఓ వివాహ వేడుకలో భాగంగా కుర్రాడితో కలసి హానియా ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేయడాన్ని గమనించొచ్చు. ఈ వీడియో క్లిప్ ను పాకిస్థాన్ కు చెందిన ఓ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. (ఇన్ స్టా గ్రామ్ వీడియో కోసం)

వివాహానికి అతిథిగా వచ్చిన హానియా తన డ్యాన్స్ తో అక్కడి వారిని ఆకట్టుకుంది. దీంతో వివాహ వేదిక ఉత్సాహంగా మారిపోయింది. ‘ఇది డ్యాన్సా? లేదంటే ఎక్సర్ సైజ్ సెషనా?' అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేయడాన్ని గమనించొచ్చు. భారత సినిమాల పట్ల హానియా తన ప్రేమను వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. 



More Telugu News