ఇది సినిమా కాదు .. జీవితం: 'బలగం' ప్రెస్ మీట్లో దిల్ రాజు

  • ఇంతవరకూ 50 సినిమాలు తీశానని చెప్పిన దిల్ రాజు
  • 'బలగం'లో ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయని వెల్లడి 
  • సెన్సార్ వారు సైతం అభినందించారని వ్యాఖ్య 
  • మార్చి 3వ తేదీన రిలీజ్ అవుతున్న సినిమా  

దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి - హన్షిత 'బలగం' సినిమాను నిర్మించారు. వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ ఇది. మార్చి 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ కొంతసేపటి క్రితం ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ వేదిక ద్వారా మూడో పాటను లాంచ్ చేశారు. 

దిల్ రాజు మాట్లాడుతూ .. "ఇటీవల కొన్ని చోట్ల ఈ సినిమా స్పెషల్ షోస్ వేశాము. సినిమా చూసినా వాళ్లంతా కూడా, తమ ఊరు .. తమ వాకిలి .. తమ జీవితాలను తెరపై చూసుకుంటున్నట్టుగా ఉందని అన్నారు. ఇక ఈ సినిమా చూసిన సెన్సార్ వారు కూడా, 'ఇది సినిమా కాదు జీవితం' అని అన్నారు. అంతగా ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్ కి అంతా కనెక్స్ట్ అయ్యారు" అని అన్నారు. 

" నా బ్యానర్లో ఇంతవరకూ 50 సినిమాలు చేశాను. 'బొమ్మరిల్లు' .. 'శతమానం భవతి' వంటి సినిమాలను ఇప్పటికీ అంతా గుర్తుచేస్తూనే ఉంటారు. అలా 'బలగం' గురించి కూడా అంతా మాట్లాడుకుంటారు. భీమ్స్ అందించిన సంగీతం ఇప్పటికే చాలామందిని ఆకట్టుకుంది. ఈ చిన్న సినిమా పెద్ద సక్సెస్ ను సాధిస్తుందని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. 



More Telugu News