ధోనీ బ్యాటింగ్ రికార్డును బద్దలు కొట్టిన కివీస్ బౌలర్.. బౌలింగ్ లోనూ మరో ఘనత

  • టెస్టుల్లో 78 సిక్స్ లు కొట్టిన ధోనీ
  • ఇంగ్లండ్ తో మ్యాచ్ లో ఆరు సిక్సర్లు బాదిన టిమ్ సౌథీ
  • మొత్తం 82 సిక్సర్లతో టాప్ 11 స్థానంలోకి
  • న్యూజిలాండ్ తరఫున అన్ని ఫార్మాట్లలో 700 వికెట్లు తీసిన బౌలర్ గానూ సౌథీ ఘనత 
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ రికార్డును న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ధనాధన్ ఇన్నింగ్స్ తో చెలరేగి సిక్సర్ల వర్షం కురిపించాడు. 49 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్ లు కొట్టి 73 పరుగులు చేశాడు.

ధోనీ తన టెస్ట్ కెరియర్ లో 78 సిక్స్ లు కొట్టాడు. ఈ మ్యాచ్ లో దాన్ని అధిగమించిన టిమ్ సౌథీ.. మొత్తంగా 82 సిక్స్ లతో ప్రపంచంలో అత్యధిక సిక్స్ లు కొట్టిన టాప్ 15 జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం 11వ స్థానంలో ఉన్నాడు. మరో 3 సిక్స్ లు కొడితే.. వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ రికార్డును కూడా దాటనున్నాడు. రిచర్డ్స్ 84 సిక్స్ లు కొట్టాడు.

మరోవైపు అన్ని ఫార్మాట్లలో 700 వికెట్లు తీసిన తొలి న్యూజిలాండ్ బౌలర్ గానూ సౌథీ చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ పడగొట్టడం ద్వారా ఈ ఘనత అందుకున్నాడు. కివీస్ తరఫున డానియల్ వెటోరీ మాత్రమే 696 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తంగా చూస్తే 1,347 వికెట్లతో శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో ఉన్నాడు.


More Telugu News