ఆ సినిమా విషయంలో శోభన్ బాబుకి ఛాయిస్ ఇచ్చిన కృష్ణ!
- 1983లో విడుదలైన 'ముందడుగు'
- ఈ నెల 25వ తేదీతో 40 ఏళ్లు పూర్తి
- ఆ సినిమా విశేషాలను పంచుకున్న సురేశ్ బాబు
- కృష్ణ గొప్ప మనసును ప్రస్తావించిన పరుచూరి బ్రదర్స్
అటు శోభన్ బాబు .. ఇటు కృష్ణ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో 'ముందడుగు' ఒకటిగా కనిపిస్తుంది. కె. బాపయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 25వ తేదీతో 40 ఏళ్లను పూర్తిచేసుకుంది. ఈ సినిమాకి రచయితలుగా పనిచేసిన పరుచూరి బ్రదర్స్ .. ఈ సినిమాతోనే ప్రొడక్షన్ వ్యవహారాలను మొదలెట్టిన సురేశ్ బాబు .. ఆనాటి సంఘటనలను గుర్తుచేసుకున్నారు.
సురేశ్ బాబు మాట్లాడుతూ .. "నేను సినిమాను గురించి నేర్చుకోవడం మొదలుపెట్టిందే 'ముందడుగు' నుంచి. ఈ సినిమా ప్రొడక్షన్ వ్యవహారాలను కొన్ని రోజుల పాటు వెంకటేశ్ కూడా చూసుకున్నాడు. ఈ సినిమా విడుదలై 40 ఏళ్లు అవుతున్నా ఇంకా గుర్తు పెట్టుకుని మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమాలో నటించిన చాలామంది ఆర్టిస్టులు ఇప్పుడు లేకపోవడం బాధగానూ ఉంది" అన్నారు.
పరుచూరి బ్రదర్స్ మాట్లాడుతూ .. " ముందుగా ఈ కథను కృష్ణగారు విన్నారు. ఆ తరువాత 'ఈ కథను శోభన్ బాబుగారికి చెప్పండీ .. ఆయనకి నచ్చిన పాత్రను ఎంచుకోమనండి .. రెండవ పాత్రను నేను చేస్తాను'అని అన్నారు. కృష్ణగారి మంచి మనసుకు ఇది ఒక నిదర్శనం. అందుకు మేము ఆయనకి హ్యాట్సాఫ్ చెబుతున్నాము. ఇద్దరూ హీరోల అభిమానులు ఈ సినిమాను ఎంజాయ్ చేశారు" అంటూ చెప్పుకొచ్చారు.