థాకరేను మరింత కార్నర్ చేసేందుకు ఏక్ నాథ్ షిండే కొత్త ఎత్తుగడ

  • తన వర్గీయుడు విప్లవ్ ను శివసేన చీఫ్ విప్ గా గుర్తించాలని మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ కు షిండే లేఖ
  • ప్రస్తుతం చీఫ్ విప్ గా ఉన్న థాకరే వర్గీయుడు పరబ్
  • శాసన మండలిలో షిండే వర్గానికి బలం తక్కువగా ఉన్న వైనం
మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధవ్ థాకరే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. శివసేన పార్టీ నుంచి తన వర్గంతో కలిసి బయటకు వచ్చిన ఏక్ నాథ్ షిండే ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయారు. బీజేపీ అండతో థాకరేని రోజురోజుకూ బలహీనంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే షిండే వర్గం శివసేన పార్టీని, ఆ పార్టీ గుర్తును సొంతం చేసుకుంది. తాజాగా థాకరేను మరింత కార్నర్ చేసేందుకు షిండే సరికొత్త ఎత్తుగడ వేశారు. శాసనమండలిలో శివసేన చీఫ్ విప్ గా విప్లవ్ బజోరయాను గుర్తించాలని కౌన్సిల్ డిప్యూటీ ఛైర్ పర్సన్ నీలమ్ గోర్హేకు షిండే లేఖ రాశారు. ప్రస్తుతం శివసేన చీఫ్ విప్ గా థాకరే వర్గానికి చెందిన ఎమ్మెల్సీ అనిల్ పరబ్ ఉన్నారు. షిండే వర్గానికి శాసనమండలిలో ఎక్కువ బలం లేదు. ఈ నేపథ్యంలో ఆయన సరికొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు. 



More Telugu News