జోరుగా సాగుతున్న పవన్ -సముద్రఖని మూవీ షూటింగ్!

  • తమిళంలో హిట్ అయిన 'వినోదయ సితం'
  • తెలుగులో రీమేక్ చేస్తున్న సముద్రఖని 
  • 20 రోజుల్లో పూర్తి కానున్న పవన్ పోర్షన్ 
  • సాయితేజ్ పాత్ర చుట్టూ తిరిగే కథ
పవన్ కల్యాణ్ ఒక వైపున 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. మరో వైపున హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను ఆరంభించడానికి రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు మధ్యలోనే తమిళ రీమేకును పూర్తిచేయనున్నట్టుగా సమాచారం. 

తమిళంలో కొంతకాలం క్రితం సముద్రఖని తన దర్శకత్వంలో 'వినోదయ సితం' సినిమాను చేశాడు. ఆ సినిమాలో ఆయన ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు కూడా. ఆ సినిమా అక్కడ మంచి విజయాన్ని సాధించింది. అదే సినిమాను పవన్ - సాయితేజ్ ప్రధాన పాత్రలుగా సముద్రఖని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. 

ఆ సినిమా షూటింగ్ రీసెంట్ గా మొదలైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగు జోరుగా జరుగుతోంది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం పవన్ కేటాయించింది 20 రోజులు మాత్రమే. ఈ డేట్స్ లోనే ఆయన పోర్షన్ ను పూర్తిచేసి, ఆ తరువాత సాయితేజ్ సీన్స్ పై దృష్టిపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. 



More Telugu News