ఈ ఫొటోలో ఉన్నది విద్యార్థిని కాదు!

  • కర్ణాటకలో హ్యూమనాయిడ్ ను రూపొందించిన ఫిజిక్స్ ప్రొఫెసర్
  • 'శిక్ష' అని నామకరణం
  • పిల్లలకు రైమ్స్, ఎక్కాలు నేర్పించడంలో 'శిక్ష' సాయం
  • అచ్చం అమ్మాయిలానే కనిపించే రోబో
కర్ణాటకలో అక్షయ్ మషేల్కర్ అనే ఫిజిక్స్ ప్రొఫెసర్ వినూత్న ఆవిష్కరణ చేపట్టారు. చిన్నారులు తరగతి గదిలో ఎంతో సరదా వాతావరణంలో గేయాలు, లెక్కలు, వారాలు తదితర అంశాలను నేర్చుకునేందుకు వీలు కల్పిస్తూ, ఓ హ్యూమనాయిడ్ (రోబో)ను సృష్టించారు. 

అచ్చం అమ్మాయిలానే కనిపించే హ్యూమనాయిడ్ పేరు శిక్ష. పిల్లలకు వివిధ పాఠ్యాంశాలను నేర్పించడంలో ఇది ఎంతగానో సహకరిస్తుంది. కర్ణాటకలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 4వ తరగతి లోపు విద్యార్థులకు 'శిక్ష' సాయంతో బోధన చేపట్టనున్నారు. శిక్ష కూడా స్కూలు పిల్లల్లాగానే యూనిఫాం ధరించి ఉంటుంది. ఎంతో హుషారుగా పాఠ్యాంశాలను చదువుతుంది. 

ఉత్తర కన్నడ ప్రాంతంలోని సిర్సి జిల్లాకు చెందిన అక్షయ్ మషేల్కర్ చైతన్య ప్రీ యూనివర్సిటీలో భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుతో స్పెషలైజేషన్ చేసిన ఆయన కొవిడ్ లాక్ డౌన్ సమయంలో హ్యూమనాయిడ్ కు రూపకల్పన చేశారు.


More Telugu News