కేసీఆర్ మన మధ్య ఉన్న దేవుడు.. సాక్షాత్తూ కొమురవెల్లి మల్లన్న స్వరూపం: తలసాని

  • యాదవుల ఆత్మీయ సమావేశంలో మంత్రి వ్యాఖ్యలు
  • గత ప్రభుత్వాల హయాంలో యాదవులు వివక్షకు గురయ్యారన్న తలసాని
  • యాదవులకు కేసీఆర్ రాయితీతో గొర్రెలు అందించారని గుర్తు చేసిన తలసాని
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పొగడ్తల వర్షం కురిపించారు. కేసీఆర్ మన మధ్య ఉన్న దేవుడని, సాక్షాత్తూ కొమురవెల్లి మల్లన్న స్వరూపమని అన్నారు. మల్లన్న ప్రతిరూపంగా ఆయన మన మధ్య ఉండి సేవలు అందిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో యాదవులు ఎంతో వివక్షకు గురయ్యారని, అలాంటి వారికి ఇప్పుడు కేసీఆర్ రూ. 11 వేల కోట్లతో రాయితీ గొర్రెలు అందించారని అన్నారు. 

యాదవుల ఆరాధ్య దైవం కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధికి కేసీఆర్ నిధులు కేటాయించారన్నారు. కరీంనగర్ లోక్‌సభకు వినోద్‌కుమార్‌ వంటి నాయకుడిని గెలిపించుకోవడం ద్వారా అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ప్రజలను కోరారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలో నిన్న కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని యాదవులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News