తెలంగాణలో మహిళా ఉద్యోగులకు ఈ నెల 8న సెలవు
- మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సర్కారు ప్రకటన
- ప్రైవేటు సంస్థల్లోని మహిళా ఉద్యోగులకు క్యాజువల్ లీవ్
- హోలీ పండుగ సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ శాఖలలోని మహిళా ఉద్యోగులు అందరికీ ఈ సెలవు వర్తిస్తుందని తెలిపింది. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న మహిళలకు స్పెషల్ క్యాజువల్ లీవ్ గా అనౌన్స్ చేసింది. మహిళా ఉద్యోగులకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలంటూ ఆదేశిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది.
అదేవిధంగా ఈ నెల 8న హోలీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఏటా మార్చి 8న మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటిస్తోంది. ఈ ఏడాది కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మహిళల ఎదుగుదలను గుర్తించే రోజుగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఉమెన్స్ డే ను ఘనంగా జరుపుకుంటాయి.