జనసేన ఆవిర్భావ సభపై కసరత్తులు... రెండ్రోజుల ముందే పవన్ రాక

  • మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ
  • మచిలీపట్నం వేదికగా ఆవిర్భావ సభ
  • మార్చి 8న ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీల ఏర్పాటు
మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభను మచిలీపట్నంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి పేర్ని నాని ఇలాకాలో ఈ సభ జరగనుండడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. కాగా, జనసేన పార్టీ అధినాయకత్వం పార్టీ ఆవిర్భావ సభపై ముమ్మరంగా కసరత్తులు చేస్తోంది. ఈ నెల 8న ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.

ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండ్రోజుల ముందే అమరావతికి రానున్నారు. ఈ నెల 12న పవన్ కల్యాణ్ అన్ని నియోజకవర్గాల కాపు నేతలతోనూ, కాపు రిజర్వేషన్ ఉద్యమకారుడు హరిరామజోగయ్యతోనూ భేటీ కానున్నారు. ఆ మరుసటి రోజు మార్చి 13న జనసేన కీలక నేతలతో పవన్ అంతర్గత సమావేశాలు నిర్వహించనున్నారు.


More Telugu News