భారత్ తో నాలుగో టెస్టులోనూ స్టీవ్ స్మిత్ కే ఆసీస్ కెప్టెన్సీ
- రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లికి అనారోగ్యం
- ఆస్ట్రేలియా వెళ్లిపోయిన కమిన్స్
- మూడో టెస్టులో ఆసీస్ కెప్టెన్ గా స్టీవ్ స్మిత్
- మార్చి 9 నుంచి నాలుగో టెస్టు
తల్లికి తీవ్ర అనారోగ్యంగా ఉండడంతో ఆస్ట్రేలియా జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ స్వదేశానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. టీమిండియాతో రెండో టెస్టు ముగిసిన వెంటనే కమిన్స్ ఆస్ట్రేలియా పయనమయ్యాడు. అతడి స్థానంలో మూడో టెస్టుకు స్టీవ్ స్మిత్ నాయకత్వం వహించగా, ఆసీస్ ఆ మ్యాచ్ లో విజయం సాధించింది.
అయితే, తల్లికి చికిత్స కొనసాగుతుండడంతో కమిన్స్ ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. మార్చి 9న భారత్ తో నాలుగో టెస్టు జరగనున్న నేపథ్యంలో, ఆసీస్ కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ నే కొనసాగించనున్నారు. ఇక, టీమిండియా ఈ సిరీస్ లో 2-1తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ, చివరి టెస్టులో గెలిస్తేనే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.