అప్పుడు కూడా ఆర్జీవీ ఇలాగే ఉండేవాడు: సీనియర్ డైరెక్టర్ శివనాగేశ్వరరావు
- తాము కలిసి 'రావుగారిల్లు' సినిమాకి పనిచేశామన్న శివనాగేశ్వరరావు
- 'శివ' సినిమాకి వర్మ దగ్గర చేశానని వివరణ
- వర్మ ఆలోచనా విధానం డిఫరెంట్ గా ఉండేదని వ్యాఖ్య
శివనాగేశ్వరరావుకి డైరెక్టర్ గా మంచి పేరు ఉంది. చాలా గ్యాప్ తరువాత ఆయన నుంచి రావడానికి 'దోచేవారెవరురా' రెడీ అవుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రామ్ గోపాల్ వర్మ గురించి ప్రస్తావించారు. "నేను .. రామ్ గోపాల్ వర్మ ఇద్దరం కూడా, 'రావుగారిల్లు' సినిమా డైరెక్షన్ డిపార్టుమెంటులో పనిచేశాము. ఆ సమయంలోనే మా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది" అన్నారు.
"నా పనితీరును .. నా సమయస్ఫూర్తిని వర్మ చాలా దగ్గరగా చూశారు. తనకి డైరెక్షన్ ఛాన్స్ వస్తే తనతో వచ్చేయాలని అప్పట్లో వర్మ నాతో అన్నారు. అలాగే 'శివ' సినిమాకి నేను ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. వర్మను గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారుగానీ, అప్పట్లో కూడా ఆయన ఇలాగే ఉండేవారు" అని చెప్పారు.
"మనందరం రోడ్డుకు ఎడమ వైపున నడుస్తాము .. 'ఎడమవైపునే ఎందుకు నడవాలి?' అని ప్రశ్నించడం వర్మకి అలవాటు. సోషల్ మీడియా వచ్చిన తరువాత వర్మ గురించి అందరూ కొత్తగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారుగానీ, మొదటి నుంచి ఆయన అలాగే ఉన్నారు " అని చెప్పుకొచ్చారు.