ఆస్కార్ వేదికపై 'నాటు నాటు' పర్ఫామెన్స్... ఇరగదీసేశారు.. వీడియో ఇదిగో!

  • ఆస్కార్ అవార్డును కైవసం చేసుకున్న నాటునాటు పాట
  • వేదికపై లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చిన రాహుల్, కాలభైరవ
  • చప్పట్లతో మారుమోగిన థియేటర్
ఆస్కార్ వేదికపై 'నాటునాటు' పాట ఊర్రూతలూగించింది. ఆస్కార్ వేదికపై ఈ పాటకు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లైవ్ పర్ఫామెన్స్ తో అదరగొట్టారు. పర్ఫామెన్స్ సందర్భంగా థియేటర్ చప్పట్లతో మారుమోగింది. మరోవైపు ఈ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ అవార్డుతో తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి ఆకాశాన్నంటింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల ప్రముఖులు ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సంగీత దర్శకుడు కీరవాణి, పాట రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు.



More Telugu News