ప్రశ్నాపత్రాల లీక్ కేసు... 40 మంది టీఎస్ పీఎస్సీ సిబ్బందికి సిట్ నోటీసులు 

  • తెలంగాణలో కలకలం రేపిన ప్రశ్నాపత్రాల లీక్
  • దర్యాప్తు చేస్తున్న సిట్
  • లీక్ కేసు నిందితురాలు రేణుక కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు
  • రేణుకకు కోచింగ్ సెంటర్లతో సంబంధాలున్నట్టు అనుమానం
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఉద్యోగ నియామకాల ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో 40 మంది టీఎస్ పీఎస్సీ సిబ్బందికి సిట్ నోటీసులు జారీ చేసింది. వారిలో ఇప్పటికే 10 మందికి పైగా గ్రూప్-1 పరీక్ష రాసినట్టు సిట్ గుర్తించింది. గ్రూప్-1 రాసిన వారితో పాటు పలువురు మిగతా ఉద్యోగులకు కూడా నోటీసులు అందించింది. 

కాగా, లీక్ కేసులో నిందితురాలు రేణుకకు కోచింగ్ సెంటర్లతో సంబంధాలు ఉన్నట్టు సిట్ అనుమానిస్తోంది. క్వశ్చన్ పేపర్ల గురించి ఉద్యోగ అభ్యర్థులతో రేణుక, ఆమె భర్త ఢాక్యా మాట్లాడినట్టు సిట్ భావిస్తోంది. రేణుక కాల్ డేటా ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రేణుకతో మాట్లాడిన కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు కూడా నోటీసులు ఇవ్వాలని సిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.


More Telugu News