ఇంకా కొందరిని కలిసిన తర్వాత మాట్లాడతా: పవన్ కల్యాణ్
- ఢిల్లీలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్
- నాదెండ్లతో కలిసి ఏపీ బీజేపీ ఇన్చార్జితో సమావేశం
- గంటన్నరపాటు సాగిన సమావేశం
జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ సాయంత్రం పవన్, నాదెండ్ల మనోహర్ తో కలిసి ఏపీ బీజేపీ ఇన్చార్జి మురళీధరన్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది. మురళీధరన్ తో పవన్, నాదెండ్ల గంటన్నరపాటు సమావేశమయ్యారు.
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై మురళీధరన్ తో చర్చించారు. జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యాచరణ అంశాలపై ఈ భేటీలో ప్రస్తావించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ స్పందిస్తూ, ఇంకా పలువురిని కలవాల్సి ఉందని వెల్లడించారు. అందరినీ కలిసిన తర్వాత వివరంగా మాట్లాడతానని తెలిపారు.