'శాకుంతలం'లో వార్ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుంది: గుణశేఖర్

  • ఈ నెల 14న రిలీజ్ కానున్న 'శాకుంతలం'
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న గుణశేఖర్
  • సినిమాలోని హైలైట్స్ గురించిన ప్రస్తావన 
  • తెరపై అద్భుతమైన ఆవిష్కరణ అని వెల్లడి

పౌరాణిక .. చారిత్రక నేపథ్యంలోని కథలపై గుణశేఖర్ కి మంచి పట్టుంది. అలాగే ఈ తరహా కథలకు ఎంత మోతాదులో గ్రాఫిక్స్ ను ఎక్కడెక్కడ ఉపయోగించాలనే విషయంలో ఆయనకంటూ ఒక అవగాహన ఉంది. అలాంటి గుణశేఖర్ నుంచి రావడానికి 'శాకుంతలం' సినిమా రెడీ అవుతోంది. 

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ నెల 14వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో గుణశేఖర్ మాట్లాడుతూ .. "ఇంతవరకూ కణ్వ మహర్షి ఆశ్రమ వాతావరణాన్ని ఒక పరిధిలో సెట్ వేసి చేస్తూ వచ్చారు. అలాగే దుష్యంతుడి దర్భార్ కి సంబంధించిన సన్నివేశాలను కూడా చిన్నపాటి సెట్ గా వేస్తూ వచ్చారు" అని అన్నారు.

'శాకుంతలం'లో మాత్రం హిమాలయాల్లోని కణ్వ మహర్షి ఆశ్రమానికి సంబంధించిన సన్నివేశాలకు, కశ్మీర్ నేపథ్యంలోని బ్యాక్ గ్రౌండ్ ప్లేట్స్ వాడుతూ .. సీజీ వర్క్ తో భారీ స్కేల్లో చూపించాము. అలాగే దుష్యంతుడి దర్బార్ ను కూడా ఒక రేంజ్ లో చూపించాము. ఇక దుష్యంతుడు పాల్గొన్న ఒక యుద్ధం తాలూకు ఎపిసోడ్ ను కూడా భారీస్థాయిలో చిత్రీకరించాము. ఇది కూడా ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుంది" అని చెప్పుకొచ్చారు. 



More Telugu News