ఫామ్ లో లేని భామలతో రవితేజ ప్రయోగం!

  • రేపు థియేటర్లకు రానున్న 'రావణాసుర'
  • థన్ ఇమేజ్ కి భిన్నంగా వెళుతున్న రవితేజ 
  • రవితేజ సరసన ఐదుగురు భామలు 
  • మాస్ యాక్షన్ డ్రామాగా నడిచే కథ 
రవితేజ ఈ మధ్య కాలంలో ఇద్దరు ముద్దుగుమ్మలతో ఎక్కువ సందడి చేస్తూ వెళుతున్నాడు. రవితేజ సినిమాల్లో సహజంగానే యాక్షన్ తో పాటు కామెడీతో కూడిన రొమాంటిక్ టచ్ ఉంటుంది. ఆయనలోని ఆ యాంగిల్ ను ఆడియన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. అందువలన తన సినిమాల్లోని కంటెంట్ లో ఆ అంశాలు మిస్సవ్వకుండా ఆయన చూసుకుంటూ ఉంటాడు. అయితే 'రావణాసుర' సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ సందడి చేయనున్నారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ తో పాటు, రవితేజ మార్క్ కామెడీ .. రొమాంటిక్ టచ్ ఉన్నాయనే విషయం ట్రైలర్ ను బట్టి మనకి అర్థమవుతూనే ఉంది. ఆ మాత్రం రొమాన్స్ కి ఇద్దరు హీరోయిన్స్ సరిపోతారు. కానీ ఐదుగురు హీరోయిన్స్ హీరో చుట్టూ తిరగనున్నారు .. పైగా నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర చుట్టూ. ఈ విషయమే ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక రవితేజ సీనియర్ స్టార్ హీరో. ఆయనకంటూ ఒక క్రేజ్ .. ఒక మార్కెట్ ఉన్నాయి. పైగా రీసెంట్ గా 'ధమాకా' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. అలాంటి రవితేజ సరసన మెరవనున్న ఐదుగురు భామల్లో దక్ష నగార్కర్ కి ఇదే ఫస్టు తెలుగు సినిమా. ఇక మిగతా నలుగురూ ఫామ్ లో లేని వారే. ఈ మధ్య కాలంలో ఓ మాత్రం సక్సెస్ కూడా లేని వారే. తన ఇమేజ్ కి భిన్నంగా వెళుతూ రవితేజ చేసిన ఈ సినిమా, ఒక ప్రయోగం వంటిదే అనుకోవాలి. ఆ ప్రయోగం ఎంతవరకూ ఫలిస్తుందనేది రేపు తేలిపోతుంది.


More Telugu News