గుడ్ ఫ్రైడేకు విషెస్ చెప్పి నెటిజన్లతో తిట్లు తిన్న నటి మాధురీ దీక్షిత్ భర్త!
- ‘హ్యాపీ గుడ్‌ఫ్రైడే’ అని ట్వీట్ చేసిన డాక్టర్ శ్రీరామ్ నేనె
- ఏసు క్రీస్తుకు సిలువ వేసిన రోజుగా గుడ్‌ఫ్రైడే
- బాధాకరమైన రోజును హ్యాపీ అని చెప్పడంతో ట్రోల్స్
- 2016లో అచ్చం ఇలానే ట్వీట్ చేసి విమర్శలు ఎదుర్కొన్న అప్పటి కేంద్రమంత్రి
బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ భర్త, ఇండియన్ అమెరికన్ సర్జన్ డాక్టర్ శ్రీరామ్ నేనె గుడ్ ఫ్రైడే సందర్భంగా చేసిన ట్వీట్ ట్రోల్స్‌కు కారణమైంది. ఆ ట్వీట్ చూసిన నెటిజన్లు శ్రీరామ్‌ను ఓ ఆట ఆడేసుకున్నారు. గుడ్‌ఫ్రైడేను పురస్కరించుకుని శ్రీరామ్ నిన్న ‘హ్యాపీ గుడ్‌ఫ్రైడే’ అని ట్వీట్ చేశారు.
అంతే, ఆ ట్వీట్ చూడగానే నెటిజన్లు మండిపడ్డారు. అసలు ‘హ్యాపీ’ అని ఎప్పుడు చెబుతారో తెలుసా? అంటూ ఆయనపై విరుచుకుపడ్డారు. కల్వరిలో ఏసు క్రీస్తుకు సిలువ వేసిన రోజును, ఆయన మరణాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ గుడ్‌ఫ్రైడే జరుపుకుంటారు. నిజానికి గుడ్ ఫ్రైడే క్రైస్తవులకు బాధాకరమైన రోజు. అయితే, గుడ్‌ఫ్రైడే పూర్వాపరాలేమీ తెలియని డాక్టర్ శ్రీరామ్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. చాలామంది నెటిజన్లు ఆయనను ట్రోల్స్ చేస్తూ ట్వీట్లు చేశారు.
నిజానికి గతంలోనూ పలువురు ‘హ్యాపీ గుడ్‌ఫ్రైడే’ అని ట్వీట్ చేసిన సందర్భాలున్నాయి. 2016లో అప్పటి కేంద్రమంత్రి మహేశ్ శర్మ ఇలాంటి ట్వీటే చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. గుడ్‌ఫ్రైడేకు నిజమైన అర్థం తెలియకపోవడమే అందుకు కారణమని చాలామంది చెబుతున్నారు. గుడ్ ఫ్రైడేలో ‘గుడ్’ ఉంది కాబట్టే అలా పొరబడుతూ ఉండొచ్చని అంటున్నారు.
కొన్ని ట్వీట్లు ఇలా..
* బ్రదర్.. మీరు ఓకేనా?
* మీరు తప్పకుండా సన్ ఆఫ్ గాడ్ సినిమా చూడాలి
* అసలు గుడ్‌ఫ్రైడే ఎందుకు చేసుకుంటారో తెలుసా మీకు?
* ఏసుకు సిలువ వేస్తే హ్యాపీనా? మీరు చెబుతున్నది నిజమేనా?
* మీకు డాక్టర్ డిగ్రీ ఎలా వచ్చింది?