అక్కినేని అఖిల్ కు బర్త్ డే విషెస్ తెలిపిన సమంత
- నేడు అఖిల్ అక్కినేని పుట్టినరోజు
- ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో స్పందించిన సమంత
- గతేడాది కూడా విషెస్ చెప్పిన సామ్
- స్పందించని అఖిల్
అక్కినేని నాగార్జున, అమల దంపతుల తనయుడు అఖిల్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. దాంతో అఖిల్ పై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అనూహ్యరీతిలో సమంత కూడా అఖిల్ కు బర్త్ డే విషెస్ తెలిపింది.
నాగచైతన్యతో వైవాహిక బంధం తెగిపోయిన తర్వాత... అక్కినేని కుటుంబంతో సమంత దూరం పాటిస్తూ వస్తోంది. అఖిల్ కు మాత్రం ప్రతి ఏటా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతోంది. అఖిల్ కొత్త సినిమాల అప్ డేట్ల సమయంలో సమంత తన స్పందన తెలియజేస్తుంటుంది.
ఆమె ఇవాళ కూడా అఖిల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం అందరి దృష్టిని ఆకర్షించింది. "హ్యాపీ బర్త్ డే అఖిల్... ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న రాబోతోంది... చూస్తుంటే నిప్పులా కనిపిస్తోంది.... లాట్సాఫ్ లవ్" అంటూ ఓ ఎమోజీతో తన సందేశాన్ని ముగించింది. ఈ మేరకు సమంత ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్టు చేసింది.
గతేడాది కూడా సమంత ఇలాగే విషెస్ చెప్పగా... అఖిల్ స్పందించలేదు. మరి ఇవాళ్టి విషెస్ కు స్పందిస్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.