నేడు పెంపుడు జంతువుల దినోత్సవం... వైరల్ అవుతున్న రామ్ చరణ్, రైమ్ ఫొటోలు
- ఏప్రిల్ 11న జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం
- నెట్టింట సందడి చేస్తున్న రామ్ చరణ్ పెంపుడు శునకం రైమ్ ఫొటోలు
- చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ ఇంట్లోనే పెరిగిన రైమ్
- రైమ్ పేరిట ఇన్ స్టాగ్రామ్ అకౌంట్
ఇవాళ ఏప్రిల్ 11 సందర్భంగా జంతు ప్రేమికులు జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం జరుపుకుంటున్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే... పెంపుడు జంతువులను బాగా ఇష్టపడే హీరోల్లో రామ్ చరణ్ ముందువరుసలో ఉంటారు.
రామ్ చరణ్ కు తగిన అర్ధాంగి ఉపసాన. ఆమెకు కూడా మూగజీవులంటే ఎంతో ప్రేమ. వీరిద్దరి పెంపుడు శునకమే రైమ్. ఇది పూడిల్ జాతికి చెందిన శునకం. ఒంటి నిండా పట్టులాంటి బొచ్చుతో ఎంతో ముద్దొస్తుంది. రామ్ చరణ్, ఉపాసన దీన్ని వదిలి ఒక్క నిమిషం ఉండలేరు.
రైమ్ చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ ఒళ్లోనే పెరిగింది. రామ్ చరణ్ విదేశాలకు షూటింగ్ లకు వెళ్లే సమయంలో చార్టర్డ్ విమానంలో ఇది కూడా ఉండాల్సిందే. షూటింగ్ లు లేకపోతే రామ్ చరణ్ కు ఇంట్లో దీంతోనే టైమ్ పాస్.
చరణ్, ఉపాసన దీన్ని కన్నబిడ్డలా ఎంతో మమకారంతో చూస్తారంటే అతిశయోక్తి కాదు. అందుకు ఈ ఫొటోలే నిదర్శనం. అన్నట్టు... రైమ్ కు ఇన్ స్టాగ్రామ్ లో సొంత అకౌంట్ కూడా ఉందండోయ్. ఆ అకౌంట్ ను 58 వేల మంది ఫాలో అవుతున్నారంటే రైమ్ ఎంత పాప్యులరో అర్థమవుతుంది.