అంబేద్కర్ విగ్రహం నిలదీస్తోంది.. సమాధానం చెప్పే దమ్ముందా కేసీఆర్?: రేవంత్ రెడ్డి

  • గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను గుర్తు చూస్తూ రేవంత్ ప్రశ్నలు
  • దళిత బంధు ఎవరికి వచ్చిందని నిలదీత
  • అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తోందని ట్వీట్
తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రశ్నలు సంధించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. శుక్రవారం ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 

‘‘దళిత బిడ్డల కాలే కడుపుల సంగతేంటని? దళితుడే తొలి ముఖ్యమంత్రన్న ద్రోహి ఎవరని? దళిత బిడ్డలకు మూడెకరాల భూమేదని? దళిత బంధు వచ్చిందెవరికి అని? సబ్ ప్లాన్ నిధులు ఏ పద్దుల కింద మాయమైపోయాయని? అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తోంది.. నిలువెత్తు విగ్రహం నిలదీస్తోంది.. సమాధానం చెప్పే దమ్ముందా కేసీఆర్?’’ అని ట్వీట్ చేశారు. 

దళిత్ ద్రోహి కేసీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతోపాటు గతంలో పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు, దళితుల కోసం ప్రభుత్వం ఏం చేయబోతోందో చెప్పిన వీడియోను పోస్ట్ చేశారు.


More Telugu News