తెలంగాణలో ఎడ్ సెట్, లాసెట్ దరఖాస్తులకు గడువు పొడిగింపు

  • తెలంగాణలో మే 18న ఎడ్ సెట్
  • మే 20, 25 తేదీల్లో లాసెట్
  • ఎడ్ సెట్, లాసెట్ దరఖాస్తులకు నిన్నటితో ముగిసిన గడువు
  • ఈ నెల 25 వరకు ఎడ్ సెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
  • ఈ నెల 29 వరకు లాసెట్ దరఖాస్తుల గడువు పెంపు
తెలంగాణలో మే 18 ఎడ్ సెట్... మే 20, 25 తేదీల్లో లాసెట్ పరీక్షలు జరగనున్నాయి. అయితే, ఈ రెండు ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించారు. ఎడ్ సెట్ దరఖాస్తులకు ఏప్రిల్ 20తో గడువు ముగియగా, ఈ నెల 25 వరకు పొడిగించారు. ఈ మేరకు ఎడ్ సెట్ కన్వీనర్ ఓ ప్రకటనలో తెలిపారు. 

నిన్నటివరకు ఎడ్ సెట్ కు 21,456 మంది దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు. ఎడ్ సెట్ దరఖాస్తులకు గడువు పొడిగించినందున, అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ స్పష్టం చేశారు. 

అటు, లాసెట్ దరఖాస్తులకు తుది గడువు ఏప్రిల్ 20తో ముగియగా, ఏప్రిల్ 29 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు లాసెట్ కన్వీనర్ వెల్లడించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంకా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే, ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 20 నాటికి లాసెట్ కు 35,072 దరఖాస్తులు అందాయని కన్వీనర్ వివరించారు.


More Telugu News