అందాల కృతి జోరు తగ్గడానికి అదే కారణమా?

  • టీనేజ్ లోనే ఇండస్ట్రీకి వచ్చిన కృతి శెట్టి 
  • హ్యాట్రిక్ హిట్ తరువాత మొదలైన కష్టాలు 
  • తెలుగులో తగ్గిన అవకాశాలు 
  • అభిమానులతో పెరుగుతున్న గ్యాప్ 
తెలుగు తెరపైకి కృతి శెట్టి తారాజువ్వలా దూసుకొచ్చింది. తెరపై కృతిని చూడగానే ఈ అందాల చందమామ ఎవరు? అంటూ కుర్రాళ్లంతా కళ్లప్పగించారు.  అందం .. అభినయంతో పాటు కృతి శెట్టి అదృష్టవంతురాలు అనుకున్నారు. అందుకు కారణం ఫస్టు మూవీ 100 కోట్లు వసూలు చేయడం .. హ్యాట్రిక్ హిట్ తన ఖాతాలో పడటం. 

అయితే ఆ తరువాత వరుసగా ఆమె మూడు ఫ్లాపులను చూసింది. అయినా కృతి శెట్టి టీనేజ్ లోనే ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ, అందువలన వరుస అవకాశాలు వస్తాయనే అంతా అనుకున్నారు. కానీ ఆమె చేతిలో  ప్రస్తుతం 'కస్టడీ' అనే సినిమా మాత్రమే ఉంది. తెలుగుతో పాటు తమిళంలోను మే 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. 

 ఇక మలయాళంలో టోవినో థామస్ జోడీగా ఆమె ఒక సినిమా చేస్తోంది. పనిలో పనిగా బాలీవుడ్ ఛాన్సుల కోసం ముంబై చుట్టూ కూడా తిరుగుతోంది. అక్కడ అవకాశాల సంగతి అలా ఉంచితే, ఈ సుందరికి ఇక్కడ గ్యాప్ రావడం ఖాయమని అంటున్నారు. కృతి ఇతర భాషలపై ఎక్కువ దృష్టి పెడుతుందా? లేదంటే ఇక్కడ మంచి కథల కోసం వెయిట్ చేస్తుందా? అనేది తెలియడం లేదు. విషయమేదైనా కృతి వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టకపోతే కష్టమే మరి. 


More Telugu News