శత్రువులపై విరుచుకుపడుతున్న 'ఛత్రపతి' .. హిందీ ట్రైలర్ రిలీజ్!

  • ప్రభాస్ కి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన 'ఛత్రపతి'
  • అదే సినిమాను హిందీలోకి రీమేక్ చేసిన వినాయక్ 
  • హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ 
  • ఈ నెల 12వ తేదీన సినిమా విడుదల
ప్రభాస్ మాస్ ఇమేజ్ ను మరోస్థాయికి తీసుకెళ్లిన సినిమాగా 'ఛత్రపతి' గురించి చెప్పుకోవచ్చు. విజయేంద్ర ప్రసాద్ కథను అందించిన ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. 2005లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. అదే సినిమా హిందీ రీమేక్ ద్వారా ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు.

వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలకు రెడీ అవుతోంది. మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడిగా .. రీమేకులను .. భారీ బడ్జెట్ సినిమాను బాగా హ్యాండిల్ చేస్తాడనే మంచి పేరు వినాయక్ కి ఉంది. అందువల్లనే ఈ రీమేక్ ఆయన చేతికి వెళ్లింది.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మెయిన్ కంటెంట్ కి తగినట్టుగానే యాక్షన్ సీన్స్ పైనే ఈ ట్రైలర్ ను కట్ చేశారు. పెన్ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ సినిమాలో నుష్రత్ కథానాయికగా నటించగా, భాగ్యశ్రీ కీలకమైన పాత్రను పోషించింది. ఈ నెల 12వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందనేది చూడాలి. 


More Telugu News