వ్యాయామం చేస్తే.. ఇవీ ప్రయోజనాలు!

  • శారీరక వ్యాయామంతో శరీరమంతటికీ మెరుగైన రక్త ప్రసరణ
  • గుండె, మెదడు సామర్థ్యాలు బలోపేతం
  • బీపీ, మధుమేహం, కేన్సర్ నుంచి రక్షణ
శారీరక వ్యాయామం చేయాలంటూ నేడు వైద్యులు దాదాపుగా ప్రతి ఒక్కరికీ సూచిస్తున్నారు. మారిన జీవనశైలితో శారీరక శ్రమ చాలా వరకు తగ్గిపోయింది. పరిశ్రమల్లో మెషినరీ, కార్యాలయాల్లో కంప్యూటర్ల వినియోగం, ఇంట్లో పనులకు ఉపకరణాల ఫలితంగా శ్రమించడం తగ్గిపోయింది. ఇదే ఎన్నో జీవనశైలి అనారోగ్యాలకు దారితీస్తుందని వైద్యులు తరచూ గుర్తు చేస్తుంటారు. కనుక ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ వ్యాయామాలు లేదా యోగసనాలు చేయాల్సిందే. 

ప్రయోజనాలు
  • శారీరక శ్రమతో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఇవి మంచి భావన కలిగించేవి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది.
  • నడక, పరుగు, ఇతర ఏరోబిక్ వ్యాయామాలతో రక్తపోటు అదుపులో ఉంటుంది. వ్యాయామంతో రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీనివల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది.
  • శారీరక చురుకు దనంతో మన శరీరంలోని కణాలు బ్లడ్ షుగర్ ను శక్తి కోసం చక్కగా ఉపయోగించుకోగలవు. దీంతో బ్లడ్ షుగర్ పెరిగిపోకుండా ఉంటుంది. 
  • చెడు, ఫ్యాటీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ముఖ్యంగా శారీరక వ్యాయామాలతో మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (హెచ్ డీఎల్) పెరుగుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.  
  • శారీరక శ్రమతో ఆందోళన కూడా తగ్గుతుంది. ముఖ్యంగా యోగాసనాలతో మంచి భావనలు కలుగుతాయి. దీనివల్ల కూడా ఆందోళన తగ్గుతుంది.
  • వ్యాయామాలతో బరువు తగ్గుతారు. వ్యాయామం సమయంలో శరీరానికి ఎక్కువ కేలరీలు అవసరమవుతాయి. దాంతో శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులను ఉపయోగించుకుంటుంది. దీనికితోడు ఆరోగ్యకరమైన ఆహారంతో సులభంగా బరువు తగ్గొచ్చు.
  • వ్యాయామంతో చర్మంపై మొటిమల సమస్య కూడా అదుపులోకి వస్తుంది. ఒత్తిడి, అధిక బ్లడ్ షుగర్, ఇన్ ఫ్లమ్మేషన్ వల్ల మొటిమల సమస్య వస్తుంటుంది.
  • ఇక వ్యాయామాలతో గుండె బలం పెరుగుతుంది. గుండె మరింత బలంగా శరీరం అంతటికీ రక్తాన్ని పంప్ చేస్తుంది. ఇది గుండె జబ్బుల రిస్క్ ను తగ్గిస్తుంది. 
  • వ్యాయామాలతో వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. దీంతో శరీరంలో హార్మోన్ల విడుదల కూడా సక్రమంగా ఉంటుంది. ఫలితంగా కేన్సర్ నుంచి రక్షణ లభిస్తుంది.
  • జ్ఞాపకశక్తి కోల్పోవడం అనే సమస్యకూ పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే వ్యాయామం వల్ల మెదడుకు రక్త సరఫరా మెరుగవుతుంది. మెదడుని కాపాడే కెమికల్స్ పెరుగుతాయి.


More Telugu News