బిచ్చగాళ్లలా అడుక్కుంటున్నారు.. ఎన్నోసార్లు అవకాశమిస్తే ఏం చేశారు?: రేవంత్‌పై కేటీఆర్
- ఐదున్నర దశాబ్దాల పాటు కాంగ్రెస్ ఏం చేయలేదన్న కేటీఆర్
- పాలమూరు ప్రజల ఆశీస్సులతోనే కేటీఆర్ ఢిల్లీ వరకు వెళ్లి తెలంగాణ సాధించారని వ్యాఖ్య
- కేసీఆర్ అంటే కొత్త అర్థం చెప్పిన తెలంగాణ మంత్రి
- రేవంత్ రెడ్డి సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని మండిపాటు
కాంగ్రెస్ పార్టీకి అన్నిసార్లు అవకాశమిస్తే ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం విమర్శించారు. తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, ఆ పార్టీకి ఒక్కటి కాదని, పదకొండుసార్లు దేశ ప్రజలు అవకాశమిచ్చినట్లు చెప్పారు. ఐదున్నర దశాబ్దాల పాటు అవకాశం ఇస్తే ఏం చేశారో ఆ పార్టీ నేతలు చెప్పాలని సవాల్ విసిరారు. పాలమూరు జిల్లా ప్రజల ఆశీస్సులతోనే ఎంపీగా గెలిచి... కేసీఆర్ ఢిల్లీ వరకు వెళ్లి, తెలంగాణ సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ అంటే కొత్త అర్థం చెప్పారు.
కేసీఆర్ అంటే కే ఆంటే కాలువలు, సీ అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అన్నారు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి అని వెల్లడించారు. పదివేల మందికి కొలువులు ఇచ్చే పరిశ్రమకు దివిటిపల్లిలో శంకుస్థాపన చేశామని తెలిపారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పట్ల సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ బిచ్చగాళ్లలా అడుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు.