'కాంతార 2' .. ఈ సారి అంతకుమించి!
- సంచలన విజయాన్ని సాధించిన 'కాంతార'
- సెకండ్ పార్టుకి సంబంధించి మొదలైన సన్నాహాలు
- స్క్రిప్ట్ లాక్ చేసిన రిషభ్ శెట్టి
- త్వరలో మొదలుకానున్న షూటింగ్
చిన్నప్పటి నుంచి తాను చూస్తూ పెరిగిన ఆచారంతో రిషభ్ శెట్టి 'కాంతార' కథను తయారు చేసుకున్నాడు. ఈ సినిమాకి ఆయనే దర్శకుడు .. ఆయనే హీరో. అడవికి సమీపంలో ఉన్న ఒక గూడెం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. వరాహ ఆరాధన విషయంలో అక్కడి గూడెం ప్రజల విశ్వాసం, దానిని కొట్టిపారేసినవారికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? అనేది కథ.
16 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 450 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అప్పటి నుంచి అంతా కూడా పార్టు 2 కోసం వెయిట్ చేస్తున్నారు. దాంతో దర్శక నిర్మాతలు ఈ సారి పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమాను నిర్మిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రంగంలోకి దిగారు.
రీసెంట్ గా ఈ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ ను రిషభ్ శెట్టి లాక్ చేసినట్టుగా సమాచారం. ఆల్రెడీ ఈ సినిమా షూటింగుకి సంబంధించిన లొకేషన్స్ ఎంపిక కూడా పూర్తయిందని అంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరుకున్నాయని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగును మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.