ఇయర్ బడ్స్ విషయంలోనే అజయ్ సాయి హత్య జరిగింది: విజయవాడ సీపీ

  • పెనమలూరు వద్ద యువకుడి హత్య
  • స్నేహితులే హంతకులు
  • నిందితులు గంజాయి మత్తులో లేరన్న సీపీ
  • ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశామని వెల్లడి
విజయవాడ సమీపంలోని పెనమలూరు వద్ద అజయ్ సాయి అనే యువకుడి హత్య తీవ్ర కలకలం రేపింది. స్నేహితులే అతడిని హత్య చేశారు. అయితే, ఇది గంజాయి మత్తులో జరిగిన దారుణం అని కథనాలు వచ్చాయి. దీనిపై విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా వివరణ ఇచ్చారు. యువకుడి హత్య కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.

ఇయర్ బడ్స్ విషయంలోనే అజయ్ సాయి హత్య జరిగిందని తెలిపారు. అజయ్ సాయిపై స్నేహితులే దాడి చేశారని వివరించారు. హత్య జరిగినప్పుడు నిందితులు గంజాయి మత్తులో లేరని సీపీ స్పష్టం చేశారు. హత్య కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశామని చెప్పారు. మరో ముగ్గురు నిందితుల కోసం నాలుగు బృందాలతో గాలింపు చేపడుతున్నట్టు వెల్లడించారు. నిందితులపై గతంలోనూ కేసులున్నాయని తెలిపారు.


More Telugu News