రిలీజ్ కు ముందే లాభాల్లోకి ‘కస్టడీ’
- రూ. 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు
- రేపు విడుదల కానున్న నాగచైతన్య సినిమా
- చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్న అక్కినేని హీరో
2021లో వచ్చిన లవ్ స్టోరీ తర్వాత అక్కినేని నాగ చైతన్య వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. గతేడాది వచ్చిన బంగార్రాజు, థ్యాంక్ యూ, లాల్ సింగ్ చద్దా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దాంతో, తన తాజా చిత్రం ‘కస్టడీ’పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. తెలుగుతోపాటు తొలిసారి నేరుగా తమిళ్ లో ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం, అరవింద్ స్వామి కీలక పాత్ర పోషించడంతో ఇరు రాష్ట్రాల్లోనూ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు చిత్ర బృందం జోరుగా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది.
దాంతో, సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే.. పెట్టుబడి మొత్తం రాబట్టినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 18 కోట్లు, ఇతర ప్రాంతాల్లో మరో మూడు కోట్లు సహా ఈ సినిమా దాదాపు 23 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. మరో కోటి రూపాయలు వస్తే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఓటీటీ, ఇతర హక్కులను లెక్కలోకి తీసుకుంటే ఈ చిత్రం ఇప్పటికే లాభాల్లోకి వచ్చేసిందని అంటున్నారు. చైతన్యకు హిట్ పడ్డా పడకపోయినా ‘కస్టడీ’ నిర్మాతలకు లాభం తెచ్చిపెట్టడం ఖాయం అంటున్నారు.