ప్రతీకారం కోసం సినిమా తీసేంత డబ్బు లేదు: సీనియర్ నటుడు నరేశ్
- తన వ్యక్తిగత జీవితం ఆధారంగా 'మళ్లీ పెళ్లి' సినిమా తీసినట్లు కొంతమంది భావిస్తున్నారన్న నరేశ్
- ప్రతికారం కోసం ఇతర మార్గాలున్నాయని వ్యాఖ్య
- సినిమా చూశాక ఎలాంటి సందేహాలు ఉన్నా సమాధానం చెబుతానని వెల్లడి
'మళ్లీ పెళ్లి' సినిమా టీజర్, ట్రైలర్ చూసిన కొంతమంది తన వ్యక్తిగత జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారని అనుకుంటున్నారని, అందులో ఎలాంటి వాస్తవం లేదని నటుడు నరేశ్ అన్నారు. ప్రతీకారం తీర్చుకోవడానికి ఇతర మార్గాలు ఉంటాయని, ప్రతీకారం తీర్చుకోవడం కోసం సినిమా తీసేంత డబ్బు తన వద్ద లేదన్నారు.
సినిమా చూసిన తర్వాత ఎలాంటి సందేహాలు ఉన్నా తాను సమాధానం ఇస్తానని చెప్పారు. సీక్వెల్ కూడా చేయమంటే చేస్తామన్నారు.
తనకు తెలుగులో ఎలాంటి గుర్తింపు ఉందో, పవిత్రకు కన్నడలో అలాంటి మంచి పేరు ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను ఈ రెండు భాషల్లో విడుదల చేయాలని భావించామని చెప్పారు. కానీ టీజర్ తర్వాత వచ్చిన స్పందనతో తమిళం, మలయాళం, హిందీల్లోను డబ్బింగ్ చేస్తున్నట్లు చెప్పారు.