ఎల్లుండి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదెవరో?

  • అదే రోజు డీకే శివకుమార్ పుట్టిన రోజు.. గిఫ్ట్ ఇస్తానని సోనియా హామీ ఇచ్చిందన్న పీసీసీ చీఫ్
  • బెంగళూరు కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు!
  • ఆదివారం భేటీలో సీఎల్పీ నాయకుడిని ఎన్నుకునే అవకాశం
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే ముహూర్తం ఖరారయింది. ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తన రాజీనామాను గవర్నర్ కు సమర్పించనున్నారు. ఎల్లుండి అంటే మే 15వ తేదీన కాంగ్రెస్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేసే ప్రయత్నాల్లో ఉంది. అదే రోజు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ పుట్టిన రోజు కూడా. కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యమంత్రి రేసులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఉన్నారు.

ఇటీవల శివకుమార్ ఇచ్చిన ప్రకటనపై ఆసక్తికర చర్చ సాగుతోంది. తన పుట్టిన రోజు నాడు సోనియా గాంధీ తనకు బహుమతి ఇస్తానని మాట ఇచ్చారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి కొలువుదీరనున్న ప్రభుత్వంలో ఎవరి పాత్ర ఏమిటనేది నేడో రేపో తేలిపోనుంది. ఆదివారం సీఎల్పీ భేటీలో సీఎల్పీ నేతను ఎన్నుకునే అవకాశముంది. రేపు సాయంత్రానికి సీఎం అభ్యర్థిత్వంపై స్పష్టత రావొచ్చునని భావిస్తున్నారు.


More Telugu News